Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all 86257 articles
Browse latest View live

శ్రీకాంత్ అనుకుని చితక్కొట్టేశారు

$
0
0

మధుప్రియకు భర్తతో విబేధాలు ఏర్పడి... గొడవ పోలీసుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. మధుప్రియ భర్త శ్రీకాంత్ పై ఇప్పటికే ఆము బంధువులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. కాగా ఆదివారం తెల్లవారుజామున శ్రీకాంత్ అనుకుని ఓ యువకుడిని మధుప్రియ బంధువులు చితక్కొట్టేశారు. ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాల ప్రకారం... రామంతాపూర్ కు చెందిన మహ్మద్ నయీమ్ మందులు కొనడానికి మెడికల్ షాపుకు వెళ్లాడు. అతడిని మసక వెలుతురులో చూసి శ్రీకాంత్ అనుకుని మెడికల్ షాపు ముందే మధుప్రియ బంధువులు నయీమ్‌ను చితక్కొట్టారు. అనంతరం వారికి అతను శ్రీకాంత్ కాదని తెలిసింది. నయీమ్ ను అతని స్నేహితులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తనను అన్యాయంగా కొట్టారంటూ బాధితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మధుప్రియ తల్లిదండ్రులతో పాటూ... మరో 14 మందిగా కేసు నమోదైంది. కాగా మధుప్రియ తల్లి ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ శ్రీకాంత్ అనుకుని కొట్టామని... క్షమించాలని కోరింది.

Mobile AppDownload and get updated news


ప్రత్యేక హోదా కోసం పోరాటం

$
0
0

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో హల్ చల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి కేంద్రం మోసం చేసిందని వారు ఆరోపించారు. సీనియర్ నాయకుడు రఘువీరా నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చేరుకున్నారు. వెళుతూ వెళుతూ రఘువీరా తనతో పాటూ ఏపీలోని 13 జిల్లాల మట్టి, నీటిని తీసుకెళ్లారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర వాటిని పెట్టి మట్టి సత్యాగ్రహం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం రెండుగంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవ్వనున్నారు. సాయంత్రం 5గంటలకు శరద్ పవార్ తో భేటీ అవుతారు.

Mobile AppDownload and get updated news

వనస్థలిపురంలో గొలుసు దొంగతనాలు

$
0
0

గొలుసు దొంగలు వనస్థలిపురంలోని మహిళలను సోమవారం టార్గెట్ చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటలో మూడు చోట్ల మెడలోని గొలుసులు తెంపుకుని పోయారు. ఒక దొంగ దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీలో ఒక మహిళ మెడలోంచి నాలుగు తులాల గొలుసు తెంపుకెళ్లారు. మరొక మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే అయిదు తులాల మంగళసూత్రం తెంపుకెళ్లిపోయారు. అలాగే ఇంకో మహిళ మెడలోంచి కూడా గొలుసు లాక్కెళ్లారు. స్థానికులు ఒక దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. దొంగ తప్పించుకుని పారిపోయాడు. ఒకే ప్రాంతంలో మూడు దొంగతనాలు జరిగేసరికి... మహిళలు భయపడిపోతున్నారు.

Mobile AppDownload and get updated news

హ్యాపీ బర్త్ డే అమీర్ ఖాన్

$
0
0

భారత్ దేశంలో ప్రముఖ నటుల్లో ఒకరైన బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సోమవారం తన 51 పుట్టినరోజు చేసుకుంటున్నారు. 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, దిల్, లగాన్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్ , మంగళ్ పాండే, ఫనా, గజిని, పీకే వంటి... బాలీవుడ్ బాక్సాఫీసులను బద్దలుకొట్టిన బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి... తనకంటూ భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అమీర్ ఖాన్ సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆయన జీవితం మొత్తం సినిమా ఇండస్ట్రీతో ముడిపడి ఉంది.

అమీర్ ఖాన్... మార్చి 14, 1965న ముంబైలోని బాంద్రాలో జన్మించారు. అతని మామయ్యా నాసర్ హుస్సేన్ తీసిన యాదోస్ కి బారాత్ (1973) అనే సినిమాలో బాలనటుడిగా నటించి... తెరంగేట్రం ఇచ్చారు ఖాన్. ఓ రెండు సినిమాలలో ఆయన బాల నటుడిగా నటించారు. అనంతరం హీరోగా కేతన్ మెహతా తీసిన హోలీ సినిమాలో 1984లో నటించారు. కానీ ఆ సినిమా అతనికి ఎలాంటి గుర్తింపును తీసుకురాలేదు. 1988లో చేసిన కయామత్ సే కయామత్ తక్ సినిమా అమీర్ ఖాన్ కు బాలీవుడ్ హీరోగా గుర్తింపును తెచ్చింది. 1990 నుంచి అమీర్ సినిమాలు వరుస కట్టాయి. దిల్, దిల్ హై కే మాంతా నమీ, జో జీతా వహీ సికందర్, రంగీలా, అందాజ్ అప్నా అప్నా, రాజా హిందూస్తానీ... అమీర్ ఖాన్ నెంబర్ వన్ స్టార్ ను చేశాయి. రాజా హిందూస్తానీ అయితే అతడిని ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిపెట్టింది.

2001లో విడుదలైన లగాన్ అమీర్ ఖాన్‌ సూపర్ స్టార్ గా మార్చింది. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చింది. 74వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రగా నామినేషన్ పొందింది. అమీర్ కు ఉత్తమ నటుడి ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. 2006లో చేసిన రంగ్ దే బసంతి కూడా బంపర్ హిట్ కొట్టింది. 2007లో తారేజమీన్ పర్ సినిమాను తీసి తొలిసారి దర్శకుడిగ మారారు అమీర్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో సంస్థను స్థాపించారు. 2008లో తీసిన 3 ఇడియట్స్ బాలీవుడ్లో 375 కోట్లు వసూలు చేసింది. ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది.

మొదటి భార్యా రీనా, పిల్లలు...


అమీర్ ఖాన్ మొదట నటి రీనా దత్తాను 1987లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. పదిహేనేళ్ల అనంతరం వారు విడాకులు తీసుకున్నారు. లగాన్ సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావును ఆయన 2005లో రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావ్ అనేక మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఇటీవలే మత అసహనంపై వ్యాఖ్యలు చేసి అమీర్ తీవ్ర దుమారానికి కారణమయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలు, ఒడిదొడుకులు ఏర్పడినా తాను వెరవనని.... ఎల్లప్పుడూ తనకు గాంధీజీయే స్పూర్తి అని చెప్పారు అమీర్.



Mobile AppDownload and get updated news

రాష్ట్రం సుసంపన్నం అయ్యేలా బడ్జెట్

$
0
0

బంగారు తెలంగాణా సాధనే తమ ధ్యేయమని... అందుకు అనుగుణంగానే బడ్జెట్ రూపకల్పన జరిగిందని టి.రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం ఉదయం 11.35 గంటలకు 2016-17 బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇంటి దగ్గర నుంచి శాసన సభకు బయలుదేరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోకముందు తెలంగాణకు కనీసం పదివేల కోట్ల రూపాయలైనా ఇవ్వలేదని, అదే ఇప్పుడు కేవలం అభివృద్ధి కార్యక్రమాలకోసమే 40వేల కోట్ల రూపాయల నుంచి రూ.50వేల కోట్ల వరకు కేటయించామని తెలిపారు. బంగారు తెలంగాణగా మారుస్తామని అన్నారు. రాష్ట్రాన్ని సుసంపన్నం చేసే దిశగా బడ్జెట్ ఉందని చెప్పారు.

Mobile AppDownload and get updated news

అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఓకే

$
0
0

ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా ప్రభుత్వంపై కొన్ని రోజుల క్రితం వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ నోటీసును పరిగణనలోోకి తీసుకుంటున్నట్టు... త్వరలో చర్చించనున్నట్టు స్పీకర్ శివప్రసాదరావు సభలో ప్రకటించారు. బీఏసీలో కూడా ఈ విషయంపై చర్చ ఉంటుందని ఆయన తెలిపారు. అయితే అవిశ్వాస తీర్మానంపై ఎప్పుడు చర్చించాలి, ఎంత సమయం చర్చించాలి అన్నవి బీఏసీ సమావేశంలో చర్చిస్తారు. నిబంధన ప్రకారమైతే నోటీసు ఇచ్చిన 14 రోజుల్లో చర్చ జరగాలి. కాగా జీరో అవర్ తరువాత చర్చ ఉండే అవకాశం ఉంది.

Mobile AppDownload and get updated news

'నేను-నా బాయ్‌ఫ్రెండ్స్'లో హెబ్బా పటేల్

$
0
0

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఇటీవల వచ్చిన 'సినిమా చూపిస్త మావ' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తమ సంస్థ ప్రతిష్టను మరింత పెంచిందనీ, తదుపరి చిత్రం కూడా ఆ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నానని బెక్కెం వేణుగోపాల్ అన్నారు.

దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా బెక్కెం వేణుగోపాల్ ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రవిశేషాలను బెక్కెం వేణుగోపాల్ చెబుతూ - "దాదాపు ఏడాదిగా ఈ కథ కోసం కసరత్తులు చేశాం. ఇది యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. మంచి థ్రిల్లింగ్ మూవీ ఇది. ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తాం'' అని చెప్పారు.

Mobile AppDownload and get updated news

పౌరసత్వ వ్యాఖ్యలపై స్పందిస్తా -రాహుల్

$
0
0

ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నోటీసుపై త్వరలో స్పందిస్తానని రాహుల్ అన్నారు. తాను ఈ విషయాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. గతంలో బ్రిటన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ .. తాను బ్రిటీష్ పౌరుడినేనని పేర్కొన్న అంశంపై సమాధానం ఇవ్వాలని లోక్ సభ ఎథిక్స్ కమిటీ జారీ చేసిన నోటీసు నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధక్షుడు ఈ విధంగా స్పందించారు. గత నవంబర్ లో బీజేపీ నేత సుమ్మమణ్యస్వామి ఈ విషయంపై ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే ఇదే అంశంపై బీజేపీ సభ్యుడు మహేష్ గిరి లోక్ సభ స్పీకర్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ విచారణ చేపట్టాల్సిందిగా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేథప్యంలో పౌరసత్యంపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీకి పార్లెమెంట్ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

Mobile AppDownload and get updated news


బాబా పాత్రలో విజయచందర్

$
0
0

సాయిబాబాగా షిర్డీ సాయిమహత్యం చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న విజయచందర్ దాదాపు 33 సంవత్సరాల తర్వాత మళ్లీ బాబాగా నటిస్తున్నారు. శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సమర్పణల రూపొందుతున్న సాయేదైవం చిత్రంలో విజయచందర్ బాబాగా నటిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ సోమవారం హైదరాబాద్ బాబా గుడిలో ప్రారంభమైంది. సాయిబాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తీస్తున్న ఈ చిత్రంలో భక్తులకు దర్శనమిస్తూ, ఉపదేశం అందించే సన్నివేశాలను చిత్ర దర్శకుడు, నిర్మాత జి.యల్.బి. శ్రీనివాస్ చిత్రీకరించారు. విజయచందర్ బాబాగా నటించడానికి అంగీకరించడం తమ అదృష్టమని, బాబా భక్తులకు కూడా ఇది ఆనందం కలిగిస్తుందని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం పతాకసన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నాం. దీంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఈనెలాఖరున ఆంధ్రప్రదేశ్‌లో, వచ్చే నెలల పాటలను విడుదల చేసి, మేలో సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన తెలిపారు. చాలా విరామం తర్వాత బాబాగా నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా విజయచందర్ చెప్పారు. మళ్లీ బాబాగా ఎలా నటిస్తానో అనే సంశయం ఉండేది. కానీ గెటప్ వేసుకున్నాక సంతృప్తి కలిగింది. చిత్ర కథ నచ్చడంతో బాబాగా నటించడానికి అంగీకరించినట్టు తెలిపారు.

Mobile AppDownload and get updated news

మధుప్రియ కథ సుఖాంతం

$
0
0

ఇబ్బందుల్లో పడిన సింగర్ మధుప్రియ వైవాహిక జీవితం కథ సుఖాంతమైంది. ఇకపై తాను తన భర్త శ్రీకాంత్‌తోనే కలిసుంటానని మధుప్రియ చెప్పగా... ప్రాణమున్నంత వరకు మధుప్రియనే తన మొదటి ప్రాధాన్యత అని శ్రీకాంత్ తేల్చిచెప్పాడు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు, సైకియాట్రిస్టులు ఇచ్చిన కౌన్సిలింగ్ ఆ ఇద్దరిలో మార్పుని తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. తనకి అత్తారింట్లో సమస్య ఎదురైందనే ఆవేదనతో పుట్టింటికి వెళ్లగా.. అక్కడే తమ తల్లిదండ్రులు తమని విడదీసేందుకు ప్రయత్నించడం వల్లే ఇదంతా జరిగిందే తప్పితే శ్రీకాంత్ కి తనకి మధ్య ఇంకెటువంటి సమస్యలు లేవని మధుప్రియ స్పష్టంచేసింది. శ్రీకాంత్ తనని అమితంగా ప్రేమించే వ్యక్తి అని అభిప్రాయపడిన మధుప్రియ.. ఇకపై తమని ఎవ్వరూ విడదీయలేరని పేర్కొంది.

ఇదిలావుంటే, మరోసారి తమని కాదని భర్త శ్రీకాంత్ తోనే వెళ్లిపోయిన మధుప్రియపై ఆమె తల్లిదండ్రులు ఒకింత అసహనం వ్యక్తంచేస్తున్నారు. తనకి ఇబ్బంది వుందని వాపోతూ పుట్టింటికి వచ్చిన మధుప్రియ మరోసారి ఇలా చేసిందో అర్థం కావడం లేదని మధుప్రియ తండ్రి ఆవేదన వ్యక్తంచేశాడు. ఏదేమైనా శ్రీకాంత్ నుంచి మధుప్రియకి ప్రాణహానీ వుందని.. ఆమె ఎక్కడున్నా క్షేమంగా వుంటే తమకి అంతే చాలని అన్నారాయన.

Mobile AppDownload and get updated news

ప్రభుత్వంపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

$
0
0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆ రాష్ర్ట ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అంతకన్నా ముందు సోమవారం ఉదయం నుంచి దాదాపు 8 గంటలపాటు సభలో జరిగిన వాగ్వీవాదాలు సభని దద్ధరిల్లేలా చేశాయి. చివరకు సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. అనంతరం సభలో సాధారణ బడ్జెట్‌పై చర్చ మొదలైనప్పటికీ.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వీవాదాల నేపథ్యంలో సభ మంగళవారానికి వాయిదా పడింది. సభ జరిగిన తీరుని తీవ్రంగా విమర్శించిన ప్రతిపక్ష నేత జగన్.. ఇదో కౌరవ సభ. కౌరవ సభలో న్యాయం జరగదు. అందుకే స్పీకర్‌పైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం అంటూ నిరసన వ్యక్తంచేశారు.

Mobile AppDownload and get updated news

చిరు సినిమాకి హీరోయిన్ ఫైనలైందా ?

$
0
0

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి ఆలోచన మొదలైనప్పటి నుంచి కథ, దర్శకుడు వంటి అంశాలతోపాటు అంతే ప్రాధాన్యతతో చర్చకొస్తున్న మరో ముఖ్యమైన విషయం హీరోయిన్ ఎంపిక. ఇటీవలే 60వ పుట్టినరోజు జరుపుకున్న చిరంజీవికి అన్నివిధాల సూటయ్యే హీరోయిన్ ఎవరా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. చిరు హీరోయిన్ల జాబితాలో నయనతార, అనుష్క, కాజల్, త్రిష వంటి వాళ్ల పేర్లు వినిపించాయి. మరీ ముఖ్యంగా నయనతార పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, నయనతార కాస్త ఎక్కువ పారితోషికం అడిగిందనే కారణంగా ఆమెని పక్కకిపెట్టారనే కథనాలొచ్చాయి. ఇక లేటెస్ట్ అప్‌డేట్స్ విషయానికొస్తే, భారీ బడ్జెట్‌తో మెగాస్టార్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తున్న ఈ సినిమా నిర్మాతలు చివరకి హీరోయిన్‌గా నయనతార పేరునే ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. చిరు సరసన నయనతార అయితేనే సరిగ్గా సూటవుతుందనే నమ్మకంతో చివరకి ఆమెవైపే మొగ్గుచూపినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడకపోవడం గమనార్హం. తమిళంలో హిట్ అయిన కత్తి సినిమానే తెలుగులో చిరు 150వ సినిమాగా వినాయక్ దర్శకత్వంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

Mobile AppDownload and get updated news

గొల్లపూడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. 

$
0
0

సోమవారం అర్థరాత్రి విజయవాడ-హైదరాబాద్ హైవేపై గొల్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 46 మంది వైద్య విద్యార్థులతో ప్రయాణిస్తున్న ధనుంజయ్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపక్కనే వున్న ఓ చెట్టుని ఢీ కొట్టి బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతిచెందగా 15 మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మెడికల్ కాలేజీ విద్యార్థుల బృందం ఏపీ28టీబీ1166 నెంబర్ గల ధనుంజయ ట్రావెల్స్ బస్సులో అమలాపురం వెళ్లి హైదరాబాద్ తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో వున్నట్టుగా ప్రమాదంలో జరిగిన బస్సులో ప్రయాణించిన విద్యార్థులు చెబుతున్నారు. మద్యం సేవించి బస్సు నడపవద్దని హెచ్చరించినప్పటికీ... డ్రైవర్ తమ మాటని నిర్లక్ష్యం చేసినట్టు విద్యార్థులు చెబుతున్నారు.

Mobile AppDownload and get updated news

నేటి నుంచి ఒంటిపూట బడులు

$
0
0

తెలంగాణ రాష్ట్రంలో స్కూలు పిల్లలకు బడి బాధ తప్పింది. రోజంతా స్కూలులో కూర్చోవాల్సిన అవసరం లేకుండా... ఒంటిపూట బడులు వచ్చేశాయి. ఎండలు బాగా ముదిరిపోవడంతో... నేటి నుంచి స్కూళ్లను ఒంటిపూట నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ గోపాల్ రెడ్డి తెలిపారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట స్కూళ్లే ఉంటాయని చెప్పారు. అనంతరం ఫైనల్ పరీక్షలు అవుతాయని... వేసవి సెలవులు అమలులోకి వస్తామని తెలిపారు.

Mobile AppDownload and get updated news

బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

$
0
0

ఉస్మానియా వైద్య విద్యార్థుల బస్సు విజయవాడ సమీపంలోని గొల్లపూడి వద్ద ఘోరప్రమాదానికి గురైన సంఘటన తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. గాయపడిన విద్యార్థులకు మెరగైన వైద్యాన్ని అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరం అనుకుంటే హైదరాబాద్ కు విద్యార్థులను తరలించాలని చెప్పారు. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి విద్యార్థుల పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.

Mobile AppDownload and get updated news


ఆ ఇల్లు సందీప్ కొనుక్కున్నాడు

$
0
0

సందీప్ కిషన్ తాను మెచ్చిన, తనకు నచ్చిన ఇంటిని కొనుక్కున్నాడు. అందుకోసం సినీపరిశ్రమలో ఏడేళ్లుగా ఉండి... కూడబెట్టుకున్నదంతా ఆ ఇంటిని కొనడం కోసం ఉపయోగించాడు. సందీప్ 2009లో ప్రస్థానం చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేశాడు. ఓ మామూలు యువకునికి ఉన్నట్టు తనకూ మూడు కోర్కెలు ఉన్నాయని చెప్పేవాడు. తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఓ సొంత ఇల్లు, స్పోర్ట్స్ కార్, హోం థియేటర్ కొనుక్కోవాలని ఉందని అనేవారు. తన కోర్కెల్లో పెద్ద కోరికను తీర్చేసుకున్నాడు. అది సొంత ఇల్లు. అవును సందీప్ తనకు నచ్చిన ఇంటిని కొనుక్కున్నాడు. సందీప్ మామయ్యకి మాదాపూర్లో నాలుగు పడకగదుల ఇల్లు ఉంది. చిన్నప్పటి నుంచి సందీప్ నేను ఎలాగైనా ఈ ఇల్లు కొంటాను అనే వాడు. కొన్నేళ్ల క్రితం మామయ్య ఆ ఇంటిని వివి వినాయక్‌కు అమ్మేశాడు. దానిని సందీప్ ఇటీవలే వినాయక్ నుంచి ఆ ఇంటిని కొన్నాడు.

Mobile AppDownload and get updated news

వైమానిక ప్రదర్శనకు భారీ భద్రత

$
0
0

అయిదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన అయిదు రోజుల పాటూ హైదరాబాద్ లోని బేగంపేటలో బుధవారం నుంచి జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రణబ్ ముఖర్జీ హాజరవ్వనున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు కూడా వస్తారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. విమానాశ్రయ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నారు. విమానాశ్రయం బయట 632 మంది పోలీసులు పహారా కాస్తారు. లోపల కేంద్రబలగాలు మోహరిస్తాయి. అసలే ఉగ్రవాదుల కన్ను హైదరాబాద్ పై ఉందని ఇంతకుముందే ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసు అధికారులు. విమానాశ్రయం చుట్టూ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరాలను పెట్టారు. కాగా అయిదు రోజుల పాటూ జరిగే ఈ కార్యక్రమంలో 17,18 తేదీలలో వీవీఐపీలు, వ్యాపారసంస్థల ప్రతినిధులకు మాత్రం ప్రవేశం ఉంటుంది. 19,20 తేదీలలో సాధారణ ప్రజలకు ప్రవేశం ఉంటుంది. టిక్కెట్లను బుక్ మై షో, ఇండియా ఏవియేషన్ వెబ్ సైట్లలో కొనుక్కోవాలి.

Mobile AppDownload and get updated news

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం

$
0
0

వచ్చే రెండు రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఏర్పడి ఉంది. అలాగే సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. కనుక కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాలలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణాలో అయితే వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఎండలు ఫిబ్రవరి నుంచే ముదురుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ సోమవారం 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రాంతంలో అత్యధికంగా అనంతపురంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Mobile AppDownload and get updated news

సభాపతిపై అవిశ్వాస తీర్మానం

$
0
0

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ప్రతిపక్ష పార్టీ వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. వైకాపా ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం శాసనసభ కార్యదర్శిని కలిసి నోటీసు అందించారు. ఆ నోటీసులో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అంతకుముందు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది వైకాపా. సోమవారం దాదాపు ఎనిమిదిగంటల పాటూ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. చివరికి పెట్టిన ఓటింగ్ లో తీర్మానం వీగిపోయింది. ఇప్పుడు వైకాపా సభాపతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది.

Mobile AppDownload and get updated news

ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది

$
0
0

విజయవాడ సమీపంలో గొల్లపూడి వద్ద ఉస్మానియా వైద్య విద్యార్థుల బస్సు ఘోర ప్రమాదానికి గురైన సంఘటన విదితమే. ఈ ఘటనలో నలుగురు వైద్య విద్యార్థులు మరణించగా, 31 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి గొల్లపూడి వెళ్లి ఆంధ్రా ఆసుపత్రి లో ఉన్న విద్యార్థులను పరామర్శించారు. ఖర్చులన్నీ తామే భరిస్తామని చెప్పారు. మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులకు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. కాగా డ్రైవర్ అతిగా తాగి నడపడం వల్లే బస్సు ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బస్సు ఢీ కొట్టిన వృక్షం కూకటి వేళ్లతో సహా బయటికి వచ్చేసింది. దీనిని బట్టి తాగుడుకు అతి వేగం కూడా తోడైనట్టు పోలీసులు భావిస్తున్నారు.

Mobile AppDownload and get updated news

Viewing all 86257 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>