Mobile AppDownload and get updated news
బీజేపీ ఎంపీ, సినీ నటుడు శతృఘ్న సిన్హా మహాకూటమి విజయ సారథి నితీశ్ కుమార్ ను కలిసారు. ఆదివారం నాటి ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ మీద ఉన్న నితీశ్ ను ఆయన స్వగృహానికి వెళ్లి మరీ సిన్హా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను గురించి నితీశ్ తో చర్చించారు. నితీశ్ పాలనలో బీహార్ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని.. అందుకే ప్రజలు మహాకూటమికి పట్టం కట్టారని విశ్లేషించారు. నితీశ్ తో బేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ మారతానని వస్తున్న వార్తలను కొట్టివేశారు. తాను చివరి వరకు బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. కమ్యూనిస్ట్ దిగ్గజం జ్యోతిబసు తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులున్న నేతగా నితీశ్ ను ఆయన అభివర్ణించారు. మహాకూటమి చేతిలో బీజేపీ పరాజయానికి కారణాలను ఇప్పటికైనా విశ్లేషించుకోవాలని.. ఓటమికి కారణమైన నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. బీజేపీలో ఉండి మహాకూటమిని పొగుడుతున్న తనపై అధిష్టాన పెద్దలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారంటూ స్థానిక బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అనంతరం ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా కలిసి శుభాకాంక్షలు చెప్పారు.