మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజక ఉప ఎన్నిక పోలింగ్ శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ప్రజలు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు రావడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 142 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేశారు. మొత్తం 366 ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలలో పెట్టారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో ఉన్న లక్షా 88వేల 236 మంది ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. 119 సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించారు... అక్కడ పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Mobile AppDownload and get updated news