Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85967

ప్రేమికుల రోజునే లవ్‌మార్క్ తో పుట్టింది

$
0
0

అమెరికాలో ఒక పాప పుట్టీ పుట్టడమే లవ్ సింబల్ తో పుట్టింది. అది కూడా ప్రేమికుల దినోత్సవం నాడు. ఈ వేలంటైన్స్ డేకు ఆ బేబీ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు సహా అందరూ ఆమె గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది ఆ పాప తల్లికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఆమె ప్రేమికుల దినోత్సవం నాడు చూడచక్కనైన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టిన సమయంలో పాప నుదిటిపై ఎర్రని మచ్చ ఉంది. దాని గురించి కంగారు పడిన తల్లితండ్రులు వైద్యులకు తెలపడంతో వారు అదేమి పట్టించుకోదగిన విషయం కాదని కొట్టివేశారు. దాన్ని పుట్టుమచ్చగా చెప్పారు. అది తర్వాత్తర్వాత శరీరంలో కలిసిపోతుందని చెప్పారు. అయితే ఆ తరువాత ఆ ఎర్రటి మచ్చ క్రమంగా హృదయం ఆకారంలోకి మారింది. కొద్ది రోజుల్లేనే ఆ బిడ్డ స్థానికంగా సెలబ్రిటీగా మారిపోయింది. ప్రేమకు ప్రతినిధిగా మారిపోయింది. తొలుత ఆ మచ్చను చూసి కంగారు పడిన తల్లితండ్రులు ఇప్పుడు ఆ మచ్చ లవ్ సింబల్ గా మారి తమ బిడ్డ సెలబ్రిటీగా మారిపోవడం చూసి ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. ఆ మచ్చలో తమ బిడ్డ ఎంత క్యూట్ గా ఉందోనని మురిసిపోతున్నారు. మొదట్లో ఆ పుట్టుమచ్చ వల్ల తమ బిడ్డ అందానికి భంగం వాటిల్లుతుందేమోనని భయపడ్డామని, ఇప్పుడు తమలో ఆ భయం మాయమైపోయిందని వారు చెప్పారు. తమ కుమార్తె జీవితాంతం ఆ లవ్ సింబల్ తో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85967

Trending Articles