రంగుల్లో ఎరుపుది ప్రత్యేకమైన స్థానం. అదేంటో... ఒకే రంగు ప్రేమకి, డేంజర్‌కి కూడా చిహ్నంగా ఉంది. మామూలు రోజుల్లో ఎరుపు రంగు డ్రెస్ వేసుకుంటే... బాబోయ్ అనే వాళ్లు.. వాలెంటైన్స్ డే రోజు వేసుకుంటే మాత్రం అబ్బా... అంటూ తెగ మెచ్చేసుకుంటారు. మీరు పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారా... అయితే ఈ ప్రేమికుల రోజును గుర్తుండిపోయేలా చేసుకోండి. మీరు అమ్మాయైతే మరీ రక్తపు రంగులో భయపెట్టే ఎరుపుని కాకుండా... మంచి రెడ్ డ్రెస్ వేసుకోండి. బ్రాస్ లెట్ లో కూడా ఎరుపు పూసలు కలిసినవి ఎంచి మరీ పెట్టుకోండి. మరీ ఎక్కువ మేకప్ కి పోకండి. ఎందుకంటే వేసుకున్న రెడ్ డ్రెస్సే చాలా మందిని ఆకర్షిస్తుంది. చెవులకి చిన్నవి ఎరుపురంగులో స్టడ్స్ లాంటివి పెట్టుకోండి. పెద్ద చెవిరింగుల జోలికి పోకండి. సన్నప్పటి రబ్బరు బ్యాండ్ పెట్టుకోండి. లిప్ స్టిక్ జోలికి పోకండి. ఆహార్యం అదిరే రంగులో ఉంది కాబట్టి... మీ మేకప్ చాలా నార్మల్ గా ఉండాలి. లేకపోతే ఎబ్బెట్టుగా కనిపిస్తారు. మీరు ఇలా తయారైతే ఎంతమందిలో ఉన్న అందరిచూపు మీవైపు ఉంటుంది.
![]()
ఇక మీరు అబ్బాయిలైతే... ఎర్ర షర్టు వేసుకోవాలని మాత్రం మేం చెప్పాం. ఎరుపు అమ్మాయిలకే అందంగా ఉంటుంది. మీరు మీ ప్రేమికురాలికి ఆ రోజు అన్ని ఎరుపు రంగులో ఉండే వస్తువులే ఇస్తూ సర్ ప్రైజ్ చేయండి. మొదట గులాబీ పూవు ఎలాగూ మీరిస్తారు... తరువాత ముదురు ఎరుపు రంగులో ఐస్ క్రీమ్ తినిపించండి. బహుమతి ఇవ్వాల్సి వస్తే... దానిలో కూడా ఎరుపు రంగు కలిసేట్టు చూడండి. లవ్ పిల్లోని కొనివ్వండి. అలాగే గుప్పెడు స్ట్రాబెర్రీ పండ్లని ఇవ్వండి. ఇలా చిన్న చిన్న వస్తువులే అన్నీ ఎరుపు రంగులో ఉన్నవే కొని రెండు గంటలకో బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరచండి. ఇవన్నీ కొనివ్వడానికి మీకు తక్కువ డబ్బులే ఖర్చవుతాయి. అలాగే ఆమెకు ఆనందంగానే, ఆసక్తిగానూ కూడా అనిపిస్తుంది.
Mobile AppDownload and get updated news