కాలం గిర్రున తిరిగింది.. అక్బర్ పెద్ద పిల్లాడయ్యాడు. పాఠశాలకు వెళ్తున్నాడు. హిందువు ఇంట్లో ముస్లింగా పెరుగుతూ ఆ ఇంట్లో కుటుంబ సభ్యుడైపోయాడు. ఈలోగా ఆ బాలుడి తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ తెలుసుకుని ఐకూ లాల్ ఇంటికి వచ్చారు. తమ కుమారుడిని తమతో పంపితే తీసుకెళ్లిపోతామని అడిగారు. కానీ, అక్బర్ వారితో వెళ్లేందుకు నిరాకరించాడు. ఐకూ లాలే తన తండ్రి అని అంటూ వారితో వెళ్లకుండా ఐకూ కుటుంబంతోనే ఉండిపోయాడు. దాంతో అతని తల్లితండ్రులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ సందర్భంగా ఐకూ లాల్ తన గతాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. తన బాల్యాన్ని గురించి అలహాబాద్ కోర్టులో వివరించాడు. ఒకప్పుడు తాను అనాథగా ఉన్న సమయంలో చౌదరి ముర్తజా హుస్సేన్ అనే ఒక ముస్లిం కుటుంబం తనను చేరదీసి పెంచి పెద్ద చేసిందన్నాడు. వారు ముస్లింలే అయినప్పటికీ హిందువునైన తన మతాన్ని మార్చలేదని, హిందూ మతస్తునిగానే పెంచారని..చదువు చెప్పించారని చెప్పాడు. నెలలో మొదటి రోజున వారికి తాను దొరికినందున తనకు ఐకూ అని పేరుపెట్టారన్నాడు.
అక్బర్‌ను కూడా తాను అలాగే పెంచానని, హిందువు అయిన తన ఇంట్లో ఆ పిల్లాడిని ముస్లింగానే పెరగనిచ్చానని తెలిపాడు. అదంతా విన్న కోర్టు ఐకూ లాల్ మంచిమనసును, ప్రేమను గుర్తించింది. బాలుడి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అక్బర్ ను ఐకూ లాల్ తోనే ఉండాలని 2008 సంవత్సరంలో తీర్పు చెప్పింది. దాంతో అక్బర్ తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో ఈ మంగళవారం కేసు విచారణకు వచ్చింది. సుప్రీం ధర్మాసనం కూడా అక్బర్ తల్లితండ్రుల పిటీషనును కొట్టివేసింది. ఆ పిల్లాడు ఐకూలాల్ తోనే ఉంటాడని తీర్పు చెప్పింది. కాకపోతే అక్బర్ ను వేసవి సెలవుల్లో అతని తల్లిదండ్రుల వద్దకు పంపాలని సూచించింది. రెండేళ్ల తరువాత అక్బర్ కు మైనారిటీ తీరి పెద్దవాడవుతాడని అప్పుడు తాను ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుంటాడని తీర్పులో పేర్కొంది.
You can also read this story in Marathi http://maharashtratimes.indiatimes.com/maharashtra/pune/uttar-pradesh-tea-vender/articleshow/51113191.cms
Mobile AppDownload and get updated news