'జిస్మ్-2'తో బాలీవుడ్ బాట పట్టిన సన్నిలియోనీ రోజురోజుకి తన పాపులారిటీని పెంచుకుంటూపోతోంది. అది బాలీవుడ్ అయినా.. టాలీవుడ్ అయినా.. లేక మరేదైనా సినీపరిశ్రమ అయినా, సన్ని ఓ సినిమాలో ఒక పాత్ర చేస్తోందంటే చాలు ఆ సినిమాకి కావాల్సినంత ఫ్రీ పబ్లిసీటీ ఇట్టే వచ్చిపడుతోంది. ఇంకొన్ని సందర్భాల్లోనైతే సన్ని పేరు చెప్పుకుని ప్రింట్లు అమ్ముకున్న సినిమా వాళ్లూ వున్నారు. అటు సన్నీ కూడా తనకున్న బిజీ టైమ్‌లోనే ఏదో కొంత సమయాన్ని చారిటీకి వెచ్చిస్తోంది. అందులో భాగంగానే తాజాగా పొగరాయుళ్లని హెచ్చరిస్తూ 'నో స్మోకింగ్' మెస్సేజ్‌తో రూపొందిన ఓ షార్ట్ ఫిలింలో నటించిన సన్నీ.. పొగరాయుళ్లకి సందేశంతో కూడిన గట్టి వార్నింగే ఇచ్చింది. బుల్లితెర నటుడు అలోక్ నాథ్, 'తను వెడ్స్ మను రిటర్న్స్' నటుడు ఫేమ్ దీపక్ డోబ్రియల్‌లు కలిసి నటించిన ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడో సెన్సేషన్‌గా మారింది.
షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ విషయానికొస్తే, ఇందులో అలోక్ నాథ్‌కి తనయుడిగా నటించిన దీపక్ చావుకి దగ్గరవుతాడు. చనిపోయే ముందు కొడుకు కోరిక తీర్చాలని భావించిన అలోక్ నాథ్ అతడి చివరి కోరికేంటో చెప్పమంటాడు. చావుకి దగ్గరైన దీపక్.. తనకి సన్నిలియోనిని కలవాలనుంది అని కోరుకుంటాడు. కొడుకు కోరిక కాస్త వింతగా అనిపించినా.. అతడి మాట కాదనలేక సన్నిలియోనిని ఇంటికి తీసుకొస్తాడు అలోక్. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ షార్ట్ ఫిలింలో చూస్తేనే బావుంటుంది.
Mobile AppDownload and get updated news