కలర్స్ ఛానెల్‌కి, కామెడి నైట్ విత్ కపిల్ షో హోస్ట్ కపిల్‌కి మధ్య గత కొన్ని నెలలుగా ప్రచ్చన్న యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ నైట్ విత్ కపిల్ టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్ ర్యాంక్ సంపాదించుకోవడంతో కపిల్ చేసిన ఫైనాన్షియల్ డిమాండ్లు, అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో అతడిని షో నుంచి బయటికి పంపించిన కలర్స్ ఛానెల్ ఆ తర్వాత చేసిన తప్పుని గ్రహించింది కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఎందుకంటే ఈ షో ముందు నుంచీ కపిల్ పేరిటే ప్రమోట్ అవడంతో అతడిని పంపించాకా ఆ షో పేరు, యాంకర్లు మార్చాల్సి వచ్చింది. కానీ ఆ ప్రయత్నాలేవీ ఛానెల్‌కి రేటింగ్స్ తెచ్చిపెట్టలేకపోయాయి. కృష్ణా అభిషేక్, భారతీ సింగ్‌లతో 'కామెడీ నైట్స్' అనే షో స్టార్ట్ చేసినప్పటికీ అది అంతగా సత్ఫలితాలివ్వలేదు. ఇదిలావుంటే, మరోవైపు కపిల్ కూడా తన పాత టీమ్‌తో సోనీ ఛానెల్లో వాలిపోయాడు. కలర్స్ ఛానెల్‌కి పోటీగా 'కామెడీ స్టైల్' అనే మరో ప్రోగ్రాంని సిద్ధం చేసుకున్నాడు. దీనిపై కూడా కోర్టు కేసుల వరకు వెళ్లింది కలర్స్ ఛానెల్. ఈ క్రమంలోనే తాజాగా ధర్మేంద్ర, సన్నిడియోల్, బాబీ డియోల్‌లు కలర్స్ ఛానెల్ నిర్వహిస్తున్న కామెడీ నైట్స్ షోలో పాల్గొన్నారు. అయితే ఈ పాత వ్యవహారమంతా ధర్మేంద్రకి ఐడియా లేదో ఏమో తెలీదు కానీ అదే వేదికపై కపిల్‌ని ప్రశంసించడం మొదలుపెట్టాడు. అయితే, తమని కాదనుకుని వెళ్లిపోయిన కపిల్ గురించి తమ షోలో ప్రశంసలు గుప్పించడం నచ్చని కలర్స్ ఛానెల్... ధర్మేంద్ర పొగడ్తల్ని కత్తిరించి ప్రసారం చేసింది. అంతకుముందే వున్న విభేదాలకి తోడు కలర్స్ ఛానెల్ తీసుకున్న ఈ స్టెప్ చూసి అవాక్కవడం ఆడియెన్స్ వంతయ్యింది. షో నుంచి ఇంటికొచ్చిన ధర్మేంద్ర వెంటనే కపిల్‌కి కాల్ చేసి మాట్లాడి తాను అక్కడ చెప్పినవన్ని ఫోనులో చెప్పేయడం ఇక్కడ ఇంకో కొసమెరుపు.
Mobile AppDownload and get updated news