పోలీసులను కరకు ఖాకీలని ప్రజలు ఊరికే అనలేదనేందుకు మరో ఉదాహరణ ఇది. లక్నోలో ఒక వృద్ధుడిపై ఆ నగర డీఐజీ పబ్లిగ్గా చేయి చేసుకున్నారు. కనీసం వయసులో పెద్దవాడనే గౌరవం కూడా ఇవ్వకుండా అందరిముందు చెంప చెల్లుమనిపించారు. లక్నో నగర వీధులలో ఆక్రమణలను తొలగించే డ్రైవ్ బుధవారం జరిగింది. ఈ డ్రైవులో స్థానిక నగర పాలక సిబ్బందితోపాటు పోలీసులు కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా డీఐజీ డీకే చౌదరి వృద్ధుడైన ఒక వీధి వ్యాపారితో దురుసుగా ప్రవర్తించారు. వీధి వ్యాపారిని చెంపదెబ్బ కొట్టి అవమానించారు. ఈ ఘటన కెమేరాల్లో రికార్డయ్యింది. దేశ వ్యాప్తంగా సదరు డీఐజీపై విమర్శలు వెల్లువెత్తాయి.
Mobile AppDownload and get updated news