తాము అమలుచేస్తున్న స్వచ్చ భారత్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలంటూ కొత్త ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ నుండి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఆహ్వానం అందింది. అక్రమాయుధాల కేసులో ఎరవాడ జైలులో శిక్ష అనుభవించిన 56 ఏళ్ల సంజయ్ దత్ ఇటీవలే శిక్ష పూర్తిచేసుకుని బయటకువచ్చిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ కు సామాజిక చైతన్యం ఎక్కువని ఆయనంటే యువతరంలో చాలా ఆకర్షణ ఉందని ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు నరేశ్ కుమార్ చెప్పారు. అందుకే ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా సంజయ్ దత్ ను ఎంపికచేశామన్నారు. ఈ విషయమై ఇప్పటికే సంజయ్ ను సంప్రతించామని తెలిపారు.
Mobile AppDownload and get updated news