దేశంలో నల్లధనం కలిగి వున్న వాళ్ల కోసం కేంద్రం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని.. ఆ పథకం పేరే ఫెయిర్ అండ్ లవ్లీ స్కీమ్ అని తనదైన స్టైల్లో సెటైర్లేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నల్లధనం కలిగివున్న వాళ్ల కోసం తీసుకువచ్చిన టాక్స్ విధానాన్ని ప్రస్తావిస్తూ.. ''ఈ ఫెయిర్ అండ్ లవ్లీ పథకం కింద దేశంలో నల్లధనం కలిగివున్న వాళ్లెవ్వరూ జైలుకెళ్లే పరిస్ధితి లేదు. పైగా తమ వద్ద వున్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది'' అని రాహుల్ ఎద్దేవా చేశారు. రాష్ర్టపతి ప్రసంగానికి కృతజ్ఞతలు చెబుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'తాను నల్లధనంపై పోరాటం చేసి అవినీతిపరులని, అక్రమార్కులని జైలుపాలుచేస్తానని 2014లో మోదీ ప్రకటించారు. కానీ ఈ నూతన విధానం ప్రకారం ఇకపై దొంగలెవ్వరూ జైలుపాలయ్యే అవకాశమే లేదు' అని రాహుల్ విమర్శించారు.
Mobile AppDownload and get updated news