భారత్ లో దాడులు నిర్వహించేందుకు 10 మంది ఉగ్రవాదులు గుజరాత్ లో అడుగుపెట్టారని పాక్ ఎన్ఎస్ఏ హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్ లో దాడులే లక్ష్యంగా రాష్ట్రంలోకి చొరబడ్డారని ఎన్ఎస్ఏ ఆఫీసర్ నాసిర్ ఖాన్ నుంచి అజిత్ దోవల్ కు సమాచారం అందింది. లష్కరే తోయిబా, జైష్ - ఏ- మహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రమూకలు పాక్ సరిహద్దు గుండా గుజరాత్ లో అడుగుపెట్టినట్లు తెలిపారు. పాక్ ఇచ్చిన సమాచారాన్ని భారత ఇంటెలిజెన్సీ కూడా నమ్ముతోంది. సోమవారం నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయాలకు వచ్చే భక్తులే టార్గెట్ చేసుకొని దాడులు నిర్వహించవచ్చని భావిస్తోంది.
ఉగ్రదాడుల హెచ్చరిక నేపథ్యంలో గుజరాత్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు రక్షణ శాఖ కార్యదర్శి అజిత్ ధోవల్ హెచ్చిరకలు జారీ చేశారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో గుజరాత్ అంతటా హె అలర్డ్ ప్రకటించారు.శివాలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెలవులు తీసుకున్న పోలీసులు ..సెలవులను రద్దు చేసుకొని డ్యూటీలో జాయిన్ అవ్వాలని గుజరాత్ డీజీపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఉగ్రవాదుల దాడులకు సంబంధించి భారత్ కు పాక్ హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Mobile AppDownload and get updated news