తెలంగాణలోని వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ను ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులుదీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు
వరంగల్ కార్పోరేషన్ లోని 58 డివిజన్లలో 398 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. పోలీంగ్ కోసం 610 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఖమ్మం కార్పోరేషన్ లోని మొత్తం 50 డివిజన్లలో 291 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 265 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయితీలో 20 వార్డులకు గాను 57 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
Mobile AppDownload and get updated news