భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కి వరుణుడి నుండి ముప్పు పొంచి ఉంది. రెండు జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్ లోని మీర్పూర్లో ఆదివారం సాయంత్రం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ మధ్యాహ్నం నుండి మీర్పూర్లో వర్షం కురవడం ప్రారంభమైంది. దాంతో వర్షం తాకిడికి పిచ్, మైదానం పాడవకుండా స్టేడియం సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అనుకున్న రీతిలో మ్యాచ్ నిర్వహించలేకపోతే ఇరు దేశాల జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉందని స్టేడియం వర్గాలు తెలిపాయి.
Mobile AppDownload and get updated news