మొత్తానికి ఎలాగోలా పాక్ క్రికెటర్లు భారత్ చేరారు. మూడు రోజుల ముందు వరకు అసలు పాక్ టీ20 ప్రపంచకప్‌లో పాక్ ఆడుతుందా ఆడదా అని ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెరపడి... పాక్ జట్టు భారత్ చేరింది. కాగా మార్చి 19 భారత్ - పాక్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లో జరగనుండగా... కొన్ని పరిస్థితుల వల్ల అది కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కు మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ కెప్టెన్ ఆఫ్రిది మాట్లాడుతూ తమకు ఈడెన్ గార్డెన్స్ చాలా కలిసొచ్చే మైదానమని అన్నారు. ఇక్కడ భారత్ తో జరిగిన మ్యాచుల్లో ఎక్కువ శాతం తామే గెలిచామని అన్నారు. ఆసియాకప్ లో సరిగా ఆడలేక పోయామని, ఈ సారి మాత్రం అలా కాదని... మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటామని తెలిపారు.
Mobile AppDownload and get updated news