Mobile AppDownload and get updated news
మధుప్రియకు భర్తతో విబేధాలు ఏర్పడి... గొడవ పోలీసుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. మధుప్రియ భర్త శ్రీకాంత్ పై ఇప్పటికే ఆము బంధువులు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. కాగా ఆదివారం తెల్లవారుజామున శ్రీకాంత్ అనుకుని ఓ యువకుడిని మధుప్రియ బంధువులు చితక్కొట్టేశారు. ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాల ప్రకారం... రామంతాపూర్ కు చెందిన మహ్మద్ నయీమ్ మందులు కొనడానికి మెడికల్ షాపుకు వెళ్లాడు. అతడిని మసక వెలుతురులో చూసి శ్రీకాంత్ అనుకుని మెడికల్ షాపు ముందే మధుప్రియ బంధువులు నయీమ్‌ను చితక్కొట్టారు. అనంతరం వారికి అతను శ్రీకాంత్ కాదని తెలిసింది. నయీమ్ ను అతని స్నేహితులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తనను అన్యాయంగా కొట్టారంటూ బాధితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మధుప్రియ తల్లిదండ్రులతో పాటూ... మరో 14 మందిగా కేసు నమోదైంది. కాగా మధుప్రియ తల్లి ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ శ్రీకాంత్ అనుకుని కొట్టామని... క్షమించాలని కోరింది.