దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా బెక్కెం వేణుగోపాల్ ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రవిశేషాలను బెక్కెం వేణుగోపాల్ చెబుతూ - "దాదాపు ఏడాదిగా ఈ కథ కోసం కసరత్తులు చేశాం. ఇది యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. మంచి థ్రిల్లింగ్ మూవీ ఇది. ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తాం'' అని చెప్పారు.
Mobile AppDownload and get updated news