సోమవారం అర్థరాత్రి విజయవాడ-హైదరాబాద్ హైవేపై గొల్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 46 మంది వైద్య విద్యార్థులతో ప్రయాణిస్తున్న ధనుంజయ్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపక్కనే వున్న ఓ చెట్టుని ఢీ కొట్టి బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతిచెందగా 15 మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మెడికల్ కాలేజీ విద్యార్థుల బృందం ఏపీ28టీబీ1166 నెంబర్ గల ధనుంజయ ట్రావెల్స్ బస్సులో అమలాపురం వెళ్లి హైదరాబాద్ తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో వున్నట్టుగా ప్రమాదంలో జరిగిన బస్సులో ప్రయాణించిన విద్యార్థులు చెబుతున్నారు. మద్యం సేవించి బస్సు నడపవద్దని హెచ్చరించినప్పటికీ... డ్రైవర్ తమ మాటని నిర్లక్ష్యం చేసినట్టు విద్యార్థులు చెబుతున్నారు.
Mobile AppDownload and get updated news