కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం 'చీకటి రాజ్యం' శుక్రవారం విడుదలైంది. రాజేష్ సెల్వ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో త్రిష, ప్రకాష్ రాజ్, కిషోర్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రం విజయపథంలో దూసుకువెళ్తున్న సందర్భంగా శనివారం హైదరాబాద్ లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. కమల్ మాట్లాడుతూ.. "రాజీవ్ కుమార్ దర్శకత్వంలో 'అమ్మనాన్న ఆట' చేస్తున్నాను. చిత్రీకరణ అంతా అమెరికాలో జరుగుతుంది చాలా ఆసక్తికరమైన శృంగారభరిత కుటుంబ కథా చిత్రం. చాలా విరామం తర్వాత అమల, నేను కలసి నటిస్తున్నాం. జరీనా వహేబ్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అమల, నా కలయికలో చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. అమల మాట్లాడుతూ చాలారోజుల తర్వాత కమల్ నటించిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. వాసు మాట్లాడుతూ.. "231 ధియేటర్లలో చిత్రాన్ని విడుదల చేశాం. ప్రేక్షకుల స్పందన అద్బుతంగా ఉంది. సోమవారం నుంచి ధియేటర్ల సంఖ్య పెంచుతున్నామన్నారు. విజయోత్సవ వేడుకకు చిత్ర బృందం హాజరయ్యారు.