ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వచ్చే వారం నుంచి కొద్ది రోజులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో తమకు ఉన్న పలు వివాదాలను పరిష్కరించుకొనే క్రమంలో కార్పొరేట్ ఆసుపత్రులు కొద్ది రోజులు ఆరోగ్య సేవలను నిలిపివేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న రోగులకు సేవలను నిలిపివేశాయి. సోమవారం నుంచి పాత రోగులకూ కూడా సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. ఈ విషయం తమ దృష్టికి రాగానే తెలంగాణ ప్రభుత్వం తరఫున వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ బంద్‌ను ప్రకటించిన 'తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్'తో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారం రోజులు గడువు ఇస్తామని అసోసియేషన్ ప్రకటించింది. ప్యాకేజీల్లోని మార్పుల విషయంలో తలెత్తిన సమస్యలు, బకాయిల చెల్లింపులు లాంటి వాటి విషయంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు, కార్పొరేట్ ఆసుపత్రుల మధ్య తలెత్తిన వివాదాల మేరకే సేవలను నిలిపివేస్తున్నామని కార్పొరేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది.
Mobile AppDownload and get updated news