దక్షిణ అమెరికాలో ఉన్న ఈక్వెడార్ దేశంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 22 మందితో వెళుతున్న సైనిక విమానం ఓ అడవిలో కూలిపోయింది. వారిలో 19 మంది సైనికులు ఉన్నారు. వారంతా పారాచూట్ ట్రైనింగ్ కోసం వెళుతున్నారు. వారితో పాటూ ఇద్దరు పైలట్లు, ఒక మెకానిక్ కూడా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఈక్వెడార్ అధ్యక్షుడు రాఫెల్ కొరియా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్లో విమానంలో ఉన్నవారంతా మరణించారని ట్వీటు చేశారు. అయితే విమాన ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు.
Mobile AppDownload and get updated news