ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన క్రిస్ గేల్ కేవలం 48 బంతుల్లోనే 11 సిక్సర్లు, 5 ఫోర్లతో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి స్టేడియం నలువైపులా పరుగుల వరద పారించాడు. టీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఈ సెంచరీ అత్యంత వేగవంతమైన మూడో సెంచరీగా రికార్డుకెక్కింది. అందూలోనూ ఈ ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లు బాదిన గేల్... టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో అత్యంత అధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఒక దశలో.. 14వ ఓవర్‌లో బౌలర్ మొయిన్ అలీ విసిరిన చివరి మూడు బంతులని మూడు భారీ సిక్సర్లుగా మలిచి హ్యాట్రిక్ కొట్టిన గేల్ ఆట ఆద్యంతం ఆకట్టుకుంది. వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కెప్టేన్ సామి ఆలోచన, ప్రణాళిక పర్‌ఫెక్టుగా పనిచేశాయి.
Mobile AppDownload and get updated news