గత ప్రభుత్వ హయంలో వైద్య ఆరోగ్యశాఖలో అనేక అక్రమాలు జరిగాయని మంత్రి కామినేని ఆరోపించారు. అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖపై చర్చ సందర్భంగా వైసీపీ నేతలు ఈ శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 104 సర్వీసు కూడా సరిగా ఉండటం లేదని ఆరోపించారు. ఆ సందర్భంగా స్పందించిన మంత్రి కామినేని.. వైఎస్ హయంలో అర్హత లేని వారిని వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు ఇచ్చారని ప్రతిదాడి చేశారు.. అప్పుడు చేసిన పాపాలను కడిగే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో అవినీతికి తావులేకుండా నిర్వహిస్తున్నామని మంత్రి వివరణ ఇచ్చారు. 104 సర్వీసులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని.. ప్రభుత్వాసుప్రతుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు మెరుగైన చికిత్సనందిస్తున్నామని మంత్రి కామినేని తెలిపారు.
Mobile AppDownload and get updated news