బాలీవుడ్ బాంబ్ షెల్ మల్లికా శెరావత్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందట. ఫ్రెంచ్‌కి చెందిన బిజినెస్ మ్యాన్‌తో కొన్ని నెలలుగా డేటింగ్ లో ఉన్నట్టు పక్కా సమాచారం. అతడు పారిస్‌కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిల్ ఆక్సెన్‌ఫ్యాన్స్. వీరిద్దరూ తరచూ జంటగానే కనిపిస్తున్నారు. అందుకే మల్లిక ఎక్కువ శాతం విదేశాల్లోనే ఉంటోంది. వారిద్దరూ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒకరికి పరిచయమయ్యారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున మల్లికను బోలెడు బహుమతులతో ముంచెత్తాడుట సిరిల్. ఆ బహుమతులలో ఓ ఖరీదైన లగ్జరీ కార్ కూడా ఉందట. ప్రస్తుతం మల్లిక హాలీవుడ్లో 'ద లాస్ట్ టూంబ్' అనే సినిమా చేస్తోంది.
Mobile AppDownload and get updated news