అమెరికాలో మరో భారతతేజం వెలుగుతుందనుకున్నాం. ప్రవాస భారతీయుడైన శ్రీనివాసన్ కు అమెరికాలోని అత్యంత ఉన్నతమైన సుప్రీం కోర్టు జడ్జి పదవి దక్కుతుందనుకున్నాం. కానీ... ఏం జరిగిందో చివరి నిమిషంలో అంతా తారుమారైంది. ఒబామా మెర్రిక్ గార్లాండ్ అనే వ్యక్తిని ఆ పదవికి నామినేట్ చేశారు. దీంతో శ్రీనివాసన్ కూడా ఒకింత బాధకు గురైనట్టు తెలుస్తోంది. సెనేట్ రిపబ్లికన్లతో చర్చల అనంతరం హడావుడిగా మెర్రిక్ గార్లాండ్ ను జడ్జిగా ప్రకటించారు. నిజానికి రిపబ్లికన్లు, డెమోక్రాట్ల ఇద్దరి మద్దతు శ్రీనివాసన్ కు ఉంది. కాగా కేవలం పదినెలల పదవీ కాలం ఉన్న అధ్యక్షుడు సుప్రీం కోర్టు జడ్జి వంటి కీలక పదవులకు వ్యక్తులను ఎంపిక చేయరాదంటూ కొంతమంది రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీనివాసన్ చంఢీఘడ్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు. 1960లలో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు.
Mobile AppDownload and get updated news