భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు వాగులూ వంకలు పొంగి పొరలుతున్న తరుణంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. వరద నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఏపీ కలెక్టర్లు, ఇతర ముఖ్య యంత్రాంగంతో ఆదివారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను అడిగితెలుసుకున్నారు. అర్థరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను సత్వరమే ఆదుకోవాలని, అదే విధంగా నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.
Mobile AppDownload and get updated news