తమిళ యువ హీరో కేశవన్ మలేషియాలో మరణించాడు. కొత్త దర్శకుడు విజయ్ నిర్మించిన 'కా కా కా పో' చిత్రంలో ఆయన నటించాడు. ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, కొన్ని రోజుల్లో విడుదలయ్యే దశలో ఉంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా కేశవన్, తన కుటుంబ సభ్యులతో కలిసి మలేషియా వెళ్లినట్టు విజయ్ తెలిపాడు. అక్కడ జలపాతాలను చూస్తూ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. సంఘటన జరిగినప్పుడు కేశవన్ పక్కనే అతని తల్లిదండ్రులు ఉన్నారు. కన్న కొడుకు కళ్ల ముందే కొట్టుకెళ్లిపోతుంటే... శోక సంద్రంలో మునిగిపోయారు. కేశవన్ మృతదేహాన్ని ఆదివారం వెలికితీశారు. హీరో దుర్మరణం పాలవ్వడంతో 'కా కా కా పో' సినిమా యూనిట్ మొత్తం దిగ్భ్రాంతి చెందింది.
Mobile AppDownload and get updated news