పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఏప్రిల్ 4వ తేదీన జమ్మూ కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన నేతల హాజరీ అందుబాటులో ఉన్నట్లు తేలితే 4వ తేదీనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని పీడీపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆమె ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తమను ఆహ్వానించాలని కోరారు. ఇందుకు సంబంధించి తమ బలాన్ని నిరూపించే ఎమ్మెల్యేల సంఖ్య ఇత్యాది వివరాలను ఆయనకు అందచేశారు. తమకు బీజేపీకి చెందిన 25మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నరుకు ఆమె వివరించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 87 సీట్లుండగా అందులో పీడీపీకి 27 సీట్లున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా ముందుకు సాగితే మెహెబూబా పేరుమీద భారతదేశపు తొలి ముస్లిం మహిళా సీఎం అనే రికార్డు కూడా నమోదుకానుంది.
Mobile AppDownload and get updated news