Mobile AppDownload and get updated news
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో ఆయన తర్వాతి సినిమాలో సన్నిలియోన్ నటిస్తోందంటూ గత కొద్ది రోజులుగా కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 'ఢిల్లీ బెల్లీ' ఫేమ్ డైరెక్టర్ అభినయ్ డియో దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమాకి సన్నిలియోన్ కూడా సైన్ చేసిందనేది ఆ పుకార్ల సారాంశం. ఇదే విషయమై తాజాగా అమీర్ ఖాన్‌ని అడగ్గా... అటువంటిదేమీ లేదని తేల్చిచెప్పాడు. అయితే, సన్నిలియోన్‌తో నటించడం మాత్రం తనకి కూడా ఇష్టమే అని చెప్పాడు అమీర్. గతంలో సన్నిలియోన్‌ని ఇంటర్వ్యూ చేసిన ఓ టీవీ జర్నలిస్టు కూడా ఇలాంటే ప్రశ్న అడిగింది. ''అమీర్ ఖాన్‌తో కలిసి నటించాలని మీకున్నప్పటికీ... అందుకు ఆయన అంగీకరిస్తాడా'' అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ... ''ఏమో చెప్పలేం. డౌటే'' అని బదులిచ్చింది సన్నీ. అప్పట్లో బాగా హైలైట్ అయిన ఈ ప్రశ్న.. ఆనోటాఈనోటా మళ్లీ అమీర్ ఖాన్ వరకి వెళ్లింది. దీంతో ఈ ప్రశ్నపై మరో ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ స్పందిస్తూ... ''ఆమెతో కలిసి నటించడానికి తనకి ఎటువంటి అభ్యంతరం లేదు'' అని చెప్పాడు. అవకాశం వుంటే త్వరలోనే ఆమెతో కలిసి నటిస్తానని బదులిచ్చాడు. బహుషా అమీర్ ఖాన్ ఇచ్చిన ఈ సమాధానమే ఈ పుకార్లకి ఓ కారణమై వుండొచ్చేమో!! ప్రస్తుతం అమీర్ ఖాన్ 'దంగల్' మూవీకి పనిచేస్తుండగా... షారుఖ్ కొత్త ప్రాజెక్ట్ 'రాయిస్'లో సన్నిలియోన్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది.