కోల్‌కతా ఫ్లైఓవర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. శనివారం శిధిలాలు తొలగిస్తున్న క్రమంలో మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో శనివారం నాటికి మృతుల సంఖ్య 25 నుంచి 27కి చేరినట్లయింది. కోల్ కతాలోని గణేష్ టాకీస్ ప్రాంతంలోగురువారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వంతెన శిధిలాల కింద పడి పలువురు మృతి చెందగా 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. శుక్రవారం రోజు మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం రోజు మరో రెండు మృత దేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 27కు చేరినట్లయింది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఫ్లైఓవర్ ను నిర్మిస్తున్న ఐవీఆర్సీఎల్ కన్‌స్ట్రక్షన్ సంస్థపై పోలీసులు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థకు చెందిన 10 మంది అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఐపీపీ సెక్షన్లు 302,307, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కోల్ కతా పోలీసు అధికారి వెల్లడించారు. పోలీసులు కష్టడీలో ఐవీఆర్సీఎల్ కన్‌స్ట్రక్షన్ సంస్థ జనరల్ మేనేజర్ మల్లికార్జున్, అసిస్టెంట్ మేనేజర్ దేబ్ జ్యోగి మజుందార్, స్ట్రక్చర్ మేనేజర్ ప్రదీప్ కుమార్ సాహాలు పోలీసుల కష్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Mobile AppDownload and get updated news