Mobile AppDownload and get updated news
త్వరలోనే రిపోర్టర్ అవతారం ఎత్తనున్నాడు మాస్ మహారాజ రవితేజ. అందుకోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన కనితన్ మూవీ అక్కడ బాగా హిట్ అయింది. ఇప్పుడిదే సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ టీఎన్ సంతోష్. గతంలోనే ఓసారి హైదరాబాద్ వచ్చి రవితేజకి ఈ స్టోరీ వినిపించి అతడిచేత ఓకే అనిపించుకున్నాడని వార్తలొచ్చాయి. అయితే, లేటెస్ట్ న్యూస్ అప్‌డేట్స్ ప్రకారం.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. రవితేజ ఇమేజ్‌కి సూటయ్యే విధంగా తెలుగులో కొన్ని మార్పులుచేర్పులు చేస్తున్నాడట డైరెక్టర్ సంతోష్. ప్రముఖ రచయిత అబ్బూరి రవి ఈ రీమేక్ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ఈ రీమేక్ గురించి ఇప్పటివరకు డైరెక్టర్ సైడ్ నుంచి తప్పించి రవితేజ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.