రియాద్: విదేశీ పర్యటనలో భాగంగా ప్రదాని మోడీ శనివారం సౌదీ అరేబియాలో పర్యటించారు. మోడీ సౌదీ చేరుకోగానే అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ సౌదీ రాజుతో సమావేశమయ్యారు. అనంతరం పలువురు సౌదీ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోడీ ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, అణు సహకారం, ఉగ్రవాదం తదితర అంశాలపై దృష్టి పెట్టారు. ఇవే అంశాలపై సౌదీ రాజుతో మోడీ చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడతూ తన పర్యటనతో భారత్ - సౌదీల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని.. ప్రధానంగా వాణిజ్యం సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సౌదీ ప్యాలెస్ లో భారత ప్రధాని మోడీకి రాజమర్యాదలు జరిగాయి.
Mobile AppDownload and get updated news