నిరుద్యోగులకు శుభవార్త ! ఉద్యోగాల భర్తీపై ఏపీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను దశల వారీగా భర్తీ చేయాలని నిర్ణయించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షన సమావేశమైన ఏపీ ఈ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు, పెండింగ్ ప్రాజెక్టు పనులు, ఉచిత ఇసుక విధానం తదితర అంశాలపై కేబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. అలాగే కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం... ఇంకా అందాల్సిన సాయం పై చంద్రబాబు కేబినెట్ చర్చించినట్లు సమాచారం.
Mobile AppDownload and get updated news