కోల్ కతా: టి20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా తుదిపోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ లో గార్డెన్ లో ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ లో విండీస్- ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. తిరుగులేని ఫామ్, అంతులేని ఆత్మవిశ్వాసం,భారత్ పై విజయంతో రెట్టించిన ఉత్సహంతో విండీస్ బరిలోకి దిగుతుంటే.. అందిరి అంచనాలను తలికిందలు చేస్తూ మెరుపు వీరులతో జోరుమీదున్న ఇంగ్లండ్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. బలమైన హిట్టర్లతో పదునైన బౌలర్లతో ఇంగ్లండ్ జట్టు సమతూకంగా ఉన్నప్పటికీ ఉపఖండపు పిచ్ లను అర్థం చేసుకొని ఆడటానికి కాస్త ఇబ్బంది పడటం ఆ జట్టుకు మైనస్ పాయింట్ . మరోవైపు విండీస్ కూడ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ .. ఈ జట్టుకు కీలకమైన బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఫాంలో లేకపోవడం ఆ జట్టుకు కాస్త ఆందోళన కల్గించే విషయం. ఏది ఎలా ఉన్నప్పటికీ లోపాలను అధిగమించి మెరుగైన ప్రదర్శన ఇచ్చిన వారికే టైటిల్ దక్కనుంది. ఇరు జట్ల ఫామ్ ను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే అవకాశముందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితం ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలపాటు వేచి చూడక తప్పదు మరి..
Mobile AppDownload and get updated news