తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 60 వేలకుపైగా విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 75 వేలకు పైగా విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి 12: 30 వరకు ఫస్ట్ పేపర్... మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ -2 పరీక్ష జరగనుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు తెలిపారు. హాల్ టికెట్, ఐడీ ప్రూఫ్ ఉన్నవారికే పరీక్ష హాల్ లోకి అనుమతించారు.
Mobile AppDownload and get updated news