నారా రోహిత్ సినిమాలు వేళ్ల మీదే లెక్క పెట్టేవే. కానీ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. భారీబడ్జెట్ సినిమాలు చేయకపోయినా... లో బడ్జెట్ సినిమాలతోనూ విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పుడు రోహిత్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సావిత్రి, రాజా చేయి వేస్తే సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. సావిత్రి సినిమా షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జరుగుతోంది. అక్కడ హీరోయిన్ నందిత, రోహిత్‌లపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ మధ్యలో రోహిత్ తన చేతులతోనే చేపల పులుసు వండి యూనిట్ సభ్యులకు అందించాడు. ఆ చేపల పులుసు తిన్న చిత్ర యూనిట్ వహ్వా అని మెచ్చుకున్నారట. రోహిత్ వంటలు వండడం ఒక హాబీ అట. వంటలు బాగా చేస్తానని తానే చెబుతున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు వండి వడ్డిస్తానని అంటున్నాడు. చేపల కూర వండుతున్న ఫొటోలను ట్విట్టర్ లో పెట్టి అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
సావిత్రి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్...
Mobile AppDownload and get updated news