ఉప ఎన్నికలో గెలిచి సంబరాలు చేసుకుంటున్నటీఆర్ఎస్ ను చూస్తుంటే జాలేస్తుందని టి.టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు వాపును చూసి బలమనుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదారాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ ఉప పోరులో టి.ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు. అయితే టీఆర్ ఎస్ పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్న మాట వాస్తవమేనని..అయితే ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మరల్చుకోవడంలో తాము విఫలమైనట్లు వెల్లడించారు. అయితే ఈ ఫలితాలు శాస్వతం కావని..భవిష్యత్తులో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని వెల్లడించారు. 2019 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Mobile AppDownload and get updated news