ప్రతిపక్షాలు అసహన వైఖరి విడనాడాలి.....
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇవి దొడ్డిదారిన సంపాదించిన ఓట్లు కావని.. ప్రజల స్వతహాగా వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దుతుగా నిలిచారన్నారు. డిపాజిట్లు రాకపోవడంతో ప్రతిపక్ష నేతలకు మతిభ్రమించిందని.. అందుకే వారు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడం లేదని హేళన చేశారు. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేశారని..అయితే ప్రజలకు వాస్తవాలు తెలిసే ప్రతిపక్షాల మాటలను నమ్మలేదన్నారు. అసత్య ఆరోపణలు చేసినందుకు వారికి డిపాజిట్లు కూడా దగ్గలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అసహన వైఖరి విడనాడి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు.
మీడియా అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు ....
టి.సర్కార్ పై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని మరీ అతస్య ప్రచారాలు చేశాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అడగడున తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కథనాలు రాశారని..అయితే దీన్ని ప్రజలు నమ్మలేదన్నారు. వాస్తవాలేంటో తెలంగాణ ప్రజలుకు తెలుసునని అందుకే అసత్య కథనాలను నమ్మకపోగా..అసాధారణ రీతిలో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారని వెల్లడించారు. తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వరంగల్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని సీఎం కేసీఆర్ అన్నారు
Mobile AppDownload and get updated news