రష్యా విమనాం కూల్చివేతను అమెరికా అధ్యక్షడు ఒబామా సమర్థించారు. గగన తలాన్ని కాపాడుకునే హక్కు ప్రతీ దేశానికి ఉంటుందని వెల్లడించారు. మంగళవారం రష్యా విమాన్ని టర్కీ కూల్చి వేసిన తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను ప్రోత్సహించడం లేదన్నారు. అనుమతి లేకేండా ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించడం సరికాదని వెల్లడించారు. ఈ విషయంపై రష్యా- టర్కీ దేశాల శాంతియుతంగా చర్చించుకోవాలని సూచించారు.
Mobile AppDownload and get updated news