ఢిల్లీ: జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోయిన బీసీసీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కమిటీ సిఫార్సులు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రీంకోర్టు.. బోర్టు వ్యవహారశైలిపై జస్టిస్ లోథా నేతృత్వంలో కమిటీ వేసి విచారణ జరిపింది. బోర్టు సభ్యలును విచారించిన లోథా కమిటీ పలు సిఫార్సులు చేసింది. అందులో ప్రధానంగా ఒక పదవిలో ఉంటూ బీసీసీఐ సభ్యుడిగా కొనసాగడాన్ని కమిటీ తప్పుబట్టింది. పాలనా విభాగాన్ని ప్రక్షాళణ చేయాలని.. రాజకీయ జోక్యం తగ్గించాలని అప్పట్లో కమిటీ సిఫార్సు చేసింది. కానీ ఇప్పటి వరకు బీసీసీఐ వాటిని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన సుప్రీంకోర్టు బీసీసీఐ తీరును తప్పుబట్టింది.
Mobile AppDownload and get updated news