విజయవాడ: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సునీల్ మంగళవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సునీల్ టీడీపీలో చేరిక విషయంలో మంత్రి నారాయణ మధ్యవర్తిత్వం వహించారు. సునీల్ నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫన గత ఎన్నికల్లో గెలుపొందారు .గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే సునీల్ .. తనకు పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ వైసీపీ నుంచి బయటికి వచ్చారు. దీంతో ఇప్పటి వరకు 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినట్లయింది.
Mobile AppDownload and get updated news