ఖైదీలను తరలిస్తున్న పోలీస్ వ్యాన్ ఒకటి అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో ఖైదీతో పాటు ఆ వ్యాన్లో ప్రయాణిస్తున్న ముగ్గురు పోలీసులు చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని విజారా ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. యూపీలోని ఘోరక్‌పూర్ కోర్టుకు స్థానిక పోలీసులు కొందరు అండర్ ట్రయల్ ఖైదీలను తీసుకుని తమ వ్యానులో మంగళవారం నాడు బయలుదేరారు. వారిని విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచిన అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి కోర్టుకు విచారణ ఖైదీలను హాజరుపరిచే ఉద్దేశంతో పోలీసులు తమ వ్యాన్ డ్రైవరును వేగంగా నడపమని సూచించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్ విజ్రా బ్రిడ్జి వద్ద అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక సబ్ ఇన్స్‌పెక్టర్, ఒక అండర్ ట్రయల్ ఖైదీ మరణించారు.
Mobile AppDownload and get updated news