ఢిల్లీ: దేశం కోసం జీవితాలను అంకితం చేసిన త్యాగమూర్తులను గత ప్రభుత్వాలు చిన్నచూపుతో చూశాయని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడిన యోధుల గొప్పతనాన్ని విస్మరించడం బాధాకరమన్నారు. బాబు జగ్జీవన్ రావ్ 109వ జయంతి వేడుకల సందర్భంగా స్టాండ్ అప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన మోడీ ఈ రకంగా పరోక్ష విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన మహా నేత బాబు జగ్జీవన్ రామ్ భావితరాలకు ఆదర్శప్రాయుడన్నారు. చిన్నతనం నుంచే గొప్ప మేధావి అయిన జగ్జీవన్ రామ్..అనేక సామాజిక సమస్యలుపై పోరాడి పరిష్కరించారని.. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుబావుడన్నారు. భారత్ లో అగ్నికల్చర్ రివల్యూషన్ కు ఆయన సృష్టి కర్త అని కొనియాడారు. 1971లో పాక్ తో జరిగిన యుద్ధ సమయంలో రక్షణ మంత్రి ఉన్న జగ్జీవన్ రామ్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన దేశాన్ని రక్షించారని... అలాంటి వ్యక్తి సేవలను విస్మరించడం బాధాకరమని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన సేవలను గుర్తించి.. ఎన్టీయే సర్కార్ ఆయన జయంతి సందర్భంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.
Mobile AppDownload and get updated news