ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న పనామా లీక్స్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా స్పందించారు. ప్రపంచానికి పన్ను ఎగవేత అనే అంశం అతిపెద్ద సమస్యగా తయారైందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచానికి పన్ను ఎగవేతదారులే పెద్ద సమస్యనేందుకు ఎటువంటి సందేహం అక్కరలేదన్నారు. వివిధ దేశాలకు చెందిన ఆదాయపన్ను సంస్థల మధ్య సమన్వయం అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఆదాయపన్నుకు సంబంధించి దేశాల మధ్య సమాచార బదలాయింపుల వల్ల అమితమైన ప్రయోజనం ఉంటుందన్నారు. తమ దేశం కొద్ది కాలంగా ఈ అంశంపై చేస్తున్న కృషి కారణంగా ఇటీవలి కాలంలో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయన్నారు. ఆదాయపన్ను చెల్లించకుండా అక్రమ మార్గాల్లో దాచుకున్న దేశాధినేతలు, వందలాది ప్రముఖుల పేర్లు పనామా లీక్స్ రూపంలో విడుదలై ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
Mobile AppDownload and get updated news