సీఎం కేసీఆర్ పై టి.టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తప్పులను ఎత్తి చూపిన మీడియాను నిందించడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. మీడియా వాక్ స్వాతంత్ర్యాన్ని హరించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. చీప్ లిక్కర్ విధానాన్ని విమర్శించడం తప్పెలా అవుతుందన్నారు. అలాగే రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్షపు ధోరణిని ఎత్తి చూడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మీడియాపై దుమ్మత్తెపోసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టి.టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఈ విధంగా స్పందించారు.
Mobile AppDownload and get updated news