రాజధాని ప్రాంతంలో భూములు రేట్లు పెరగకుండా నియంత్రిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజల సమ్మేళనమని..ఇందులో పేద, ధనిక అన్నివర్గాల వారు జీవించే పరిస్థితి ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న అద్దెలను నియంత్రించేందకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడ ప్రాంతంలో హైదరాబాద్, ముంబై కంటే అద్దెలు ఎక్కవగా ఉండటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడలో సూపర్ స్పెషాలిటి డెంటల్ ఆస్ప్రతిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కు దీటుగా అమరావతి లో ఆస్పత్రుల నిర్మాణాలను చేపడతామన్నారు.
Mobile AppDownload and get updated news