కార్తిక్, శ్వేతా వర్మ జంటగా జికె సినిమాస్ పతాకంపై నౌషాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లవ్ చెయ్యాలా వద్దా..?. జి.వి.రమణ, సి.సంతోష్ కుమారి నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 15న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో.. నిర్మాత రమణ మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 15న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సుమారుగా 150 నుండి 200 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది' అని అన్నారు. దర్శకుడు నౌషాద్ మాట్లాడుతూ.. 'వైజాగ్, హైదరాబాద్, పాండిచ్చేరి ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ నిర్వహించాం. ఔట్‌పుట్ బాగా వచ్చింది. టెక్నికల్ వాల్యూస్‌తో ఉన్న సినిమా. మ్యూజికల్‌గా కూడా సినిమాకు మంచి పేరొస్తుంది. రోమాన్స్, లవ్ వంటి అంశాలతో రూపొందించిన మంచి యూత్‌ఫుల్ సినిమా ఇది. నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు' అని అన్నారు.
Mobile AppDownload and get updated news