Mobile AppDownload and get updated news
మాస్టర్ చంద్రాంషువు నార్ని సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్‌లో బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటిస్తున్న చిత్రం 'వర్మ vs శర్మ'. ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుందీ సినిమా. ఉగాది సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు భువన విజయ్ మాట్లాడుతూ... ఈ చిత్రం పూర్తిగా గోదావరి జిల్లాల్లోని ఆహ్లాదకరమైన లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకుందని.. హాస్య ప్రధానంగా మూఢ నమ్మకాలపై రూపొందిన ఈ చిత్రం గోపాలా..గోపాల, పీకె, తరహాలో కామెడీ సెటైర్‌గా ఉంటుందని అన్నారు. వర్మ పాత్రలో గిరిబాబు, శర్మ పాత్రలో రేలంగి తగినంత హాస్యాన్ని పండించారని.. హీరో తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రయత్నించిన విధానం అందరినీ నవ్విస్తూనే, చివర్లో థ్రిల్‌కి గురి చేస్తుందని అన్నారు. రమణ రాథోడ్ సంగీతం ఈ చిత్రాన్ని మరో మెట్టుకు తీసుకెళ్తుందని తెలిపారు.