భానుచందర్, జాన్, సాయికిరణ్, సుజిత, మౌనిక ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'మారాజు'. టి.సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శివప్రసాద్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏవియం ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం గురువారం ఉదయం హైదరాబాద్, అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రభుకిరణ్ క్లాప్ కొట్టగా, డాక్టర్ సుభట్టా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. శివప్రసాద్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. భానుచందర్ మాట్లాడుతూ "సరైన మెడికల్ వ్యవస్థ లేకపోవడం, ప్రభుత్వ సహాయం సకాలంలో అందకపోవడంతో పలువురు గిరిజనులు మరణిస్తున్నారు. గిరిజనులు, కొండప్రాంత వాసులు ఎటువంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు? అనేది చిత్రకథ. గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నాను. కమర్షియల్ సినిమాగా తీస్తున్నారు" అని అన్నారు. జాన్ మాట్లాడుతూ "టైటిల్ పాత్రలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. డైలాగ్ వెర్షన్ సహా స్క్రిప్ట్ అంతా పూర్తయింది. గిరిజనులకు ఏ విధంగా సహాయ సహకారాలు చేయవచ్చనేది సినిమాలో చూపిస్తున్నాం" అని అన్నారు.
Mobile AppDownload and get updated news