మౌనమేలనోయి, నీ జతగా నేనుండాలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సచిన్ జోషి తన నిర్మాణ సంస్థ అయన వైకింగ్ మీడియా ఎంటర్‌టైన్మెంట్ ద్వారా రామ్ గోపాల్ వర్మ తెలుగు, కన్నడ బాషలలో తెరకెక్కించిన " కిల్లింగ్ వీరప్పన్" సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు. హిందీ 'కిల్లింగ్ వీరప్పన్'లో తనదైన శైలిలో వారానికి ఒక సారి వివిధ పోస్టర్‌లు రిలీజ్ చేయడంతో పాటు హిందీ వీరప్పన్‌లో పాత్రలను ఒక్కరొక్కరిగా పరిచయం చేస్తున్న రామ్ గోపాల్ వర్మ.. వీరప్పన్‌ను పట్టుకోవడం కోసం పోలీసులకు సహకరించడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రియ అనే దైర్య సాహసాలు కలిగిన ఒక మధ్య తరగతి సాదారణ యువతీ పాత్రను లీసారేకి ఆఫర్ చేశాడు. తెలుగు వారందరికీ మహేష్ బాబు టక్కరి దొంగ సినిమా ద్వారా పరిచయం అయిన అందాల భామే ఈ లిసా రే అనే సంగతి తెలిసిందే. ఉత్తరాది వారికి అంతగా తెలియని వీరప్పన్ గురించి వారికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నట్టు సచిన్ తెలిపాడు.
Mobile AppDownload and get updated news